సచివాలయ పోస్టులు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారు: చంద్రబాబు

ఏపీలో దుర్మారగపు పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ.. అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. సచివాలయ పరీకల్లో పేపర్ లీక్ చేసి.. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా తీసేశారని మండిపడ్డారు. కడపలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొని నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నేతలకు పలు కీలక సూచనలు చేశారు. యువతను ప్రోత్సహించాలని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామవాలంటీర్ల వ్యవస్థపైనా.. చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అసలు వాళ్లను ఎందుకు నియమించారో తెలియడం లేదన్నారు. వాలంటీర్లకు పనులే లేవని చెప్పారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై కూడా చంద్రబాబు స్పందించారు. చివరికి గాంధీజీ విగ్రహాలను, దేవుడిని కూడా వదలడం లేదని అన్నారు. ఇది వాయిదాల ప్రభుత్వమని.. చివరికి వాయిదాలతోనే కొట్టుకుపోతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com