జగన్ మూడు ముక్కలాటతో రైతుల ప్రాణాలు పోతున్నాయి: లోకేష్

వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ మూడు ముక్కలాటతో రైతుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీ నందిపాటి గోపాలరావు మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. జై అమరావతి అన్నందుకు మహిళలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమని విమర్శించారు. పోలీసు బూట్లతో అమరావతిని తొక్కేద్దాం అనుకుంటున్న వైఎస్ జగన్ కల నెరవేరబోదన్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఓసారి నష్టపోయిందన్న లోకేష్.. ఇప్పుడు రాజధాని విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చేయడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి ప్రణాళిక లేకుండా రాజధాని విభజనతోనే ఏం సాధించాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప సాధించింది ఏముందని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com