తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపైనా చర్చిస్తారని తెలుస్తోంది. గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా సమీక్షించనున్నారు. దాదాపు మూడున్నర నెలల తరువాత కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశం అయ్యారు. ఇద్దరూ ఏకాంతంగానే చర్చలు జరపనున్నారు. అధికారుల్ని ఈ భేటీకి పిలవలేదు.
కేంద్రంతో సంబంధాలపై కూడా జగన్‌కు కేసీఆర్ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పార్లమెంట్లో సీఏఏ చట్టానికి వైసీపీ మద్దతు తెలుపగా టీఆర్ఎస్ వ్యతిరేకించింది. విభజనకు సంబంధించిన అంశాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి కమిటీ నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా ఏపీ ఒప్పుకోలేదు. తెలంగాణ నుండి రిలీవైన 613 మంది ఉద్యోగులను ఏపీ చేర్చుకోవడం లేదు. ఇలాంటి చిక్కుముళ్లకు పరిష్కారం ఇద్దరు CMల భేటీతో దొరికే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com