తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తున్నారు: సుజయ కృష్ణ రంగారావు

X

తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా సీఎం జగన్ పాలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత సుజయ్ కృష్ణరంగారావు అన్నారు. విజయనగరంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్.. తన నటన, పాలనతో అందరినీ అలరించారన్నారు. ప్రభుత్వం అంటే ఓ నిరంతర ప్రక్రియ అని.. అనుభవ రాహిత్యం, అజ్ఞానంతో జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతికి కారణమవుతున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచి.. భవిష్యత్తు అంధకారంగా మారుతోందన్నారు సుజయ్ కృష్ణరంగారావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
