ఏపీ ప్రభుత్వం అవి బయట పెట్టాలి: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం అవి బయట పెట్టాలి: చంద్రబాబు

ప్రపంచం మొత్తం కరోనా వలన తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. భారత్‌లో వారం రోజుల్లో 222శాతం కరోనా కేసులు పెరిగాయని.. అయితే ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. వారం రోజుల్లో ఏపీలో 1,021శాతం కరోనా కేసులు పెరిగాయని అన్నారు. దేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, ఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కరోనా వలన ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైందని అన్నారు. రైతుల పరిస్థితి అంతకంతకు దిగజారుతుందని.. వారిని ఆదుకోవాలని అన్నారు. ఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడంలేదన్నారు. వాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరమన్నారు.

Tags

Next Story