భారత్‌లో కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి

భారత్‌లో కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి
X

కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే కొత్త కేసులు 3,967 నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649 కి చేరుకుంది. ఇక చికిత్స తీసుకుని కోలుకున్న వారి సంఖ్య 27,920 మంది కాగా, చికిత్స పొందుతున్న వారు 51,401 మంది ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినా మహరాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.

Tags

Next Story