వ్యవస్థలు, చట్టాలు మారాల్సిన అవసరం ఉంది : సీఎం కేసీఆర్

Update: 2019-06-02 05:10 GMT

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలు, చట్టాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఫ్యూడల్ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు చాలా ఉన్నాయని.. ఇలాంటివే భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ప్రభుత్వ సంకల్పానికి అవరోధాలుగా నిలిచాయని అన్నారు.

అందుకే రెవెన్యూ చట్టాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేరు మార్పు, వారసత్వ హక్కులు బదిలీ, రిజిస్ట్రేషన్ సందర్భంలో అక్రమాలు పరిష్కరించేలా కొత్త చట్టం తెస్తామన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావాలంటే.. ప్రజలు సమిష్టి కృషితోనే ఆ సంస్కరణ సాకారమవుతుందన్నారు.

Similar News