Gold Prices : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Update: 2024-04-29 09:53 GMT

ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.330 తగ్గి రూ.72,600కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.66,550గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 700గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72వేల 750గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని మంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67 వేల 400గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73వేల 530గా ఉంది.

హైదరాబాద్ విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 550గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72వేల 600గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 550గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72వేల 600గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News