సమ్మె విరమణ దిశగా ఆర్టీసీ?

Update: 2019-06-11 06:27 GMT

ఏపీఎస్‌ ఆర్టీసీలో సమ్మె విరమణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేఏసీ నేతలతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఇవాళ కూడా చర్చలు జరపనున్నారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు, కాంట్రాక్టు డ్రైవర్లు- కండక్టర్ల క్రమబద్దీకరణ, భత్యం పెంపు లాంటి వాటిపై హామీ లభించింది. మిగతా డిమాండ్లపైన కూడా సానుకూలంగానే ఉన్నామని.. ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నా లిఖితపూర్వకమైన హామీకి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సిబ్బంది కుదింపు, అద్దెబస్సుల పెంపు వద్దంటున్న జేఏసీ నేతల వాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది.

ఇవాళ్టి చర్చల్లో సమ్మె విరమణకు కార్మిక సంఘాల్ని ఒప్పిస్తామని ఎండీ సురేంద్రబాబు చెప్తున్నారు. మంత్రి పేర్ని నాని కూడా ఆర్టీసీ విలీనం సహా అన్ని హామీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని చెప్పడంతో.. సమ్మె విరమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ్టి చర్చల తర్వాత కార్మిక సంఘాలు సీఎంను కలవనున్నాయి.

Similar News