Alert : అలెర్ట్.. ఆ సమయంలో ఇంట్లోనే ఉండండి

Update: 2024-05-02 04:35 GMT

ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 234 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలని తెలిపింది.

ఏపీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణలోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా రికార్డయినట్లు వాతావారణ శాఖ తెలిపింది. మరో 3 రోజులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News