AP: జగన్‌ సభలతో ప్రజల ముప్పుతిప్పలు

ట్రాఫిక్ ఆంక్షలు... బస్సుల తరలింపులతో ప్రజలకు అవస్థలు

Update: 2024-05-02 03:30 GMT

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నిర్వహిస్తున్న బహిరంగ సభలు ప్రజలకు ముప్పతిప్పలు తెస్తున్నాయి. ట్రాఫిక్‌ ఆంక్షలు, బస్సులు తరలింపులతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వైకాపా నేతల ప్రలోభాలతో సభకు తరలించిన జనం..... సీఎం ప్రసంగానికంటే ముందుగానే ఇంటిబాట పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ నిర్వహిస్తున్న బహిరంగ సభలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏలూరులో అగ్నిమాపక కేంద్రం కూడలిలో సాయంత్రం జరిగిన సభ కోసం ఉదయం నుంచే దుకాణాలు మూయించారు. అంతేకాక సీఎం సభకు జనాన్ని తీసుకొచ్చేందుకు బస్సులన్నీ తరలించేశారు. దీంతో సుదూర ప్రాంతాలు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్‌ సభ కోసం వందలాది ఆటోలు పెట్టి... మనిషికి 200 రూపాయలు ఇచ్చి మరీ వేలాది మంది మహిళలను తరలించారు. అయితే మండుటెండలో ఉంటలేక... చాలామంది జగన్‌ ప్రసంగానికంటే ముందుగానే సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ జనం లేక వెలవెలబోయింది.


విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం సభ సైతం సామాన్యులను ఇబ్బందులుకు గురిచేసింది. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి సభావేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు మూసివేసి.... దుకాణదారుల పొట్టకొట్టారు. ఆ మార్గంలో రాకపోకలు సైతం నిలిపివేయడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సీఎం సభ కోసమని... జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తూ... ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం వస్తే... బస్సులు నిలిపేయడం ఏంటని... సామాన్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి సభకు తరలించిన జనం... సీఎం ప్రసంగం పూర్తవకముందే ముందే ఇంటిబాట పట్టారు. ఎండలో ఉండలేక సీఎం మాట్లాడుతుండగా జారుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరో 12రోజుల్లో జరగబోయే ఎన్నికలు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తని సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పాయకరావుపేటలో.. ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ .................. ఈ 58 నెలల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా మేనిఫెస్టోలో 99శాతం హామీలు...... అమలు చేశామని చెప్పారు. కూటమి మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని జగన్ విమర్శించారు. 

Tags:    

Similar News