మంత్రివర్గ విస్తరణపై చర్చ.. కేసీఆర్‌కు సవాల్‌గా మారిన..

Update: 2019-06-12 02:09 GMT

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రావడం. ఎమ్మెల్సీ, స్థానిక, ప్రాదేశిక అన్ని ఎన్నికలు పూర్తవ్వడంతో ఇక మంత్రి వర్గాన్ని విస్తరించడం పక్కా అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రి వ‌ర్గన్ని ఏర్పాటు చేయడంతో.. మరి తెలంగాణలో విస్తర‌ణకు ముహుర్తం ఎప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

టిఆర్‌ఎస్‌ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయలేదు సీఎం కేసీఆర్. మొదట తనతో పాటు మహమూద్ అలీని మాత్రమే కేబినెట్‌లో తీసుకున్న కేసీఆర్.. మరో రెండు నెలల తర్వాత మరో తొమ్మిది మందిని మంత్రి వర్గంలోనికి తీసుకున్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉన్నా పెండింగ్‌లో పెట్టారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు ఎదురు చూపులు తప్పడం లేదు. మంత్రి వర్గంలో స్థానం కోసం లాబీయింగ్ చేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు తమకు మంత్రులుగా ప్రమోషన్ ఇస్తారనే ఆశతోనే గ‌డిపేస్తున్నారు.

గులాబి బాస్ కేసీఆర్ ఎందుకు పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటుపై ఆలస్యం చేస్తున్నారో అనే చర్చ ఎమ్మెల్యేల్లో తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇప్పటి వరకు వరుస ఎన్నికలే కేబినెట్‌ కూర్పు ఆలస్యానికి కారణమా.. లేక ఆశవాహులు ఎక్కువ ఉండటమే అస‌లు కారణమా అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మ‌రోవైపు ఏపీలో సీనియ‌ర్లు జూనియ‌ర్లల‌తో పాటు అన్ని సామాజిక వ‌ర్గాల‌ను ట‌చ్ చేస్తూ మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ్యడంతో ఇక్కడ కూడ అలానే చేస్తే బాగుటుంద‌న్న చ‌ర్చ పార్టి వ‌ర్గాల్లో జోరందుకుంది. కేబినెట్‌ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం గులాబి బాస్ కేసిఆర్‌కు సవాల్‌గా మారింది.

ఎమ్మెల్యే ఎన్నిక‌ల ఫ‌లితాల నుండి ఎంపి ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు చాలా ప‌రిణ‌మాలు మారాయి.. ఖ‌మ్మం లాంటి జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో మంత్రి తుమ్మల ఒడిపోగా.. ఎంపి ఎన్నిక‌ల్లో మాత్రం ఎవ‌రు ఉహించ‌ని విధంగా భారి మెజారిటితో టిఆర్ఎస్ విజ‌యం సాధించింది. నామ గెలుపులో కీల‌కంగా మారిన తుమ్మల ఇప్పుడు మ‌ళ్ళి మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకున్నారు.. మరోవైపు చేవేళ్ల ఎంపి గెలవ‌డంతో పాటు రంగారెడ్డి ఎమ్మెల్సిగా గెలిచిన మాజీ మంత్రి మ‌హేందర్ రెడ్డి తిరిగి మంత్రి ప‌ద‌వి కోసం ఆరాట ప‌డుతున్నారు. కాని ఇదే జిల్లా నుండి మాజీ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డికి కూడ కేసిఆర్ మంత్రి ప‌ద‌వి విష‌యంలో మాట ఇచ్చారు. అలాగే అసెంబ్లి సాక్షిగా ఇద్దరు మ‌హిళ‌ల‌కు మంత్రిప‌ద‌వులు అంటూ హ‌మి ఇచ్చారు.. అటు ఉమ్మడి మెద‌క్‌లో రెండు ఎంపీలను గెలింపించుకున్న హ‌రిష్ రావుకు కూడ మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిన ప‌రిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇక న‌ల్గొండ జిల్లా నుంచి కూడ మాజీ ఎంపీ గుత్తా సుఖేంధ‌ర్ రెడ్డి మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. పార్టిలో ఉన్నవారిని ఎలా మేనేజ్‌ చేయాలన్న క‌స‌ర‌త్తులో కేసిఆర్ ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టి నుండి టిఆర్ఎస్‌లో చేరిన స‌భ్యుల‌ను స్పీక‌ర్ టిఆర్ఎస్ స‌భ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవ‌డంతో వారి నుండి కూడ ఆశావాహులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తమకూ ఒక ఆవ‌కాశం ఇవ్వాలంటు గులాబి పెద్దలను కోరుతున్నారు.

Similar News