KTR: ఈ బతుకు కంటే చావడం మేలు కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు

Update: 2025-12-19 11:04 GMT

పా­ర్టీ ఫి­రా­యిం­చిన ఎమ్మె­ల్యే­ల­పై బీ­ఆ­ర్‌­ఎ­స్ కా­ర్య­ని­ర్వా­హక అధ్య­క్షు­డు కే­టీ­ఆ­ర్ తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు.  ము­ఖ్యం­గా మాజీ స్పీ­క­ర్ పో­చా­రం శ్రీ­ని­వా­స్ రె­డ్డి­ని ఉద్దే­శిం­చి ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­నీ­యాం­శ­మ­య్యా­యి. 75 ఏళ్ల వయ­సు­లో, గతం­లో స్పీ­క­ర్‌­గా, మం­త్రి­గా అన్ని గౌరవ పద­వు­ల­నూ అను­భ­విం­చిన వ్య­క్తి.. ఇలాం­టి వయ­సు­లో కాం­గ్రె­స్  లో చే­ర­డం  సి­గ్గు­చే­ట­ని మం­డి­ప­డ్డా­రు. కే­సీ­ఆ­ర్ ఆయ­న­కు ఇవ్వ­ని పదవి లే­ద­ని, కానీ నేడు గౌ­ర­వం పో­గొ­ట్టు­కు­ని కాం­గ్రె­స్ బెం­చీ­ల్లో కూ­ర్చో­వ­డం ఆయన పత­నా­ని­కి ని­ద­ర్శ­న­మ­ని కే­టీ­ఆ­ర్ వి­మ­ర్శిం­చా­రు.

అసెం­బ్లీ­లో పో­చా­రం ప్ర­వ­ర్త­న­ను కే­టీ­ఆ­ర్ ఎద్దే­వా చే­శా­రు. బి­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే అయి ఉండి కాం­గ్రె­స్ పక్షాన ఎం­దు­కు కూ­ర్చు­న్నా­ర­ని మా సభ్యు­లు ప్ర­శ్ని­స్తే, బా­త్రూ­మ్ దగ్గ­ర­గా ఉం­ద­ని అం­దు­కే ఇక్కడ కూ­ర్చు­న్నా­న­ని సమా­ధా­నం ఇవ్వ­డం అత్యంత దౌ­ర్భా­గ్యం" అని పే­ర్కొ­న్నా­రు. ఇలాం­టి అగౌ­ర­వ­క­ర­మైన జీ­వి­తం గడ­ప­డం కంటే మర­ణిం­చ­డం మే­లం­టూ ఆయన తీ­వ్ర­స్థా­యి­లో ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. రే­వం­త్ రె­డ్డి పక్షాన చేరి పో­చా­రం తన ఇన్నే­ళ్ల మంచి పే­రు­ను స్వ­యం­గా మంట గలు­పు­కు­న్నా­ర­ని అన్నా­రు.   

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫైర్

పా­ర్టీ మా­రిన మి­గి­లిన 10 మంది ఎమ్మె­ల్యేల తీ­రు­ను కూడా కే­టీ­ఆ­ర్ తీ­వ్రం­గా  మం­డి­ప­డ్డా­రు.  వారు తాము ఏ పా­ర్టీ­లో ఉన్నా­మో చె­ప్పు­కో­లే­ని ని­స్స­హాయ స్థి­తి­లో ఉన్నా­ర­ని, కనీ­సం తాము ఏ పక్ష­మో  మగ­వా­రో, ఆడ­వా­రో అన్నంత స్ప­ష్టత లే­న­ట్లు­గా చె­ప్పు­కో­లేక పో­తు­న్నా­ర­ని ఘా­టు­గా వి­మ­ర్శిం­చా­రు. ఇలాం­టి సి­ద్ధాం­తం లేని రా­జ­కీ­యం సమా­జా­ని­కి చెడు సం­కే­తా­లు పం­పి­స్తుం­ద­ని, ప్ర­జ­లు వీ­రి­ని అస­హ్యిం­చు­కుం­టు­న్నా­ర­ని కే­టీ­ఆ­ర్  వి­మ­ర్శిం­చా­రు. సీ­ని­య­ర్ నా­య­కు­డు కడి­యం శ్రీ­హ­రి తీ­రు­పై కూడా కే­టీ­ఆ­ర్ మం­డి­ప­డ్డా­రు. తనకు నచ్చిన పా­ర్టీ­లో ఉం­టా­నం­టూ కడి­యం చే­స్తు­న్న వ్యా­ఖ్య­లు విం­టుం­టే.. అలా మా­ట్లా­డే వా­రి­ని కొ­ట్టా­ల­ని­పి­స్తుం­ద­ని ఆవే­శం­గా వ్యా­ఖ్యా­నిం­చా­రు.

Tags:    

Similar News