గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం పిన్నేల్లిలో షేక్ జాన్ అనే టీడీపీ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాచేపల్లిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని కలిసి తిరిగి వస్తుండగా తుమ్మల చెరువు చెట్టు వద్ద కాపుకాసి జాన్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జాన్‌ను గురజాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.