అందుకే మాదాపూర్‌లో ట్రాఫిక్.. 5 లక్షల మంది ఒకేసారి బయటకు రావద్దు..

Update: 2019-06-24 01:28 GMT

హైదరాబాద్‌లో ఓ మాదిరి వర్షానికే రోడ్లు చెరువులవుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు GHMC సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏటా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఇవాళ, రేపు కూడా గ్రేటర్‌లో భారీవర్షాలు పడొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ట్రాఫిక్ కష్టాలు తలుచుకుంటేనే సామాన్యుడికి నీరసం వచ్చేస్తోంది.

GHMC కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్‌ CP సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఐతే.. ప్రస్తుతం మనకు ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా.. గంటకు 2 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే పరిస్థితి ఇలాగే తయారవుతుందని.. ఇది దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడ్డప్పుడు అంతా ఒకేసారి బయటకు రాకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు.

Similar News