బయటకు వచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఫోన్ సంభాషణ

Update: 2019-07-02 07:17 GMT

అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. వనమాతోపాటు ఆయన తనయుడు రాఘవేంద్రరావు, పలువురు నాయకులపై కేసులు పెట్టినట్లు లక్ష్మీదేవిపల్లి సీఐ టి.కరుణాకర్‌ తెలిపారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్‌ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేసేందుకు అధికారులు కందకాలు తవ్వారు. ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు సాగుదారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని గిరిజనులు ఎమ్మెల్యే వనమా దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఘటన స్థలానికి చేరుకుని అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ లక్ష్మీదేవిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు..

అటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ..ఫారెస్ట్ ఆఫీసర్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. DROకు ఫోన్ చేసిన వనమా..పోడుభూముల జోలికి వెళ్లొద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడానని ... సమస్య పరిష్కారం అయ్యేవరకు..గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే పనులు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే వనమా...

 

Similar News