Kawasaki : డిస్కౌంట్ల సునామీ..లక్షల్లో తగ్గిన బైక్ ధరలు..కవాసాకి షోరూంలకు క్యూ కడుతున్న కుర్రాళ్లు.

Update: 2026-01-09 08:15 GMT

Kawasaki : సూపర్ బైక్ కొనాలనే కల ఉందా? అయితే ఇదే మీకు సరైన సమయం. ప్రముఖ దిగ్గజ సంస్థ కవాసాకి బైక్ ప్రియుల కోసం కనీవినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ సూపర్ బైక్ మోడళ్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్లను ఇస్తూ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ నింజా ZX-10R పై కళ్ళు చెదిరే ధరను తగ్గించి బైక్ రైడర్లకు కొత్త సంవత్సర కానుకను అందించింది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉండనుంది.

సూపర్ బైక్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందే కవాసాకి నింజా ZX-10R పై కంపెనీ ఏకంగా రూ.2,50,000 నేరుగా తగ్గింపును ప్రకటించింది. సాధారణంగా లీటర్ క్లాస్ సూపర్ బైక్స్‌పై ఇలాంటి భారీ డిస్కౌంట్లు రావడం చాలా అరుదు. ఈ డిస్కౌంట్ తర్వాత బైక్ ఆన్-రోడ్ ధర గణనీయంగా తగ్గనుంది. సెప్టెంబర్ 2025లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.49 లక్షలుగా ఉండేది. తాజా ఆఫర్‌తో ఈ రేంజ్ బైక్ ప్రియులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

కేవలం ZX-10R మాత్రమే కాదు, కవాసాకి తన ఇతర పాపులర్ మోడళ్లపై కూడా భారీ తగ్గింపులను ప్రకటించింది. నింజా 1100SX పై రూ.1.43 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. నింజా 650 పై రూ.27,000 తగ్గింపుతో ఇప్పుడు రూ.7.64 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. నింజా 500 పై రూ.17,000 డిస్కౌంట్ ఇస్తున్నారు (కొత్త ధర రూ.5.49 లక్షలు). ఎంట్రీ లెవల్ రైడర్లకు ఇష్టమైన నింజా 300 బైక్‌పై రూ.28,000 తగ్గించి రూ.2.89 లక్షలకే ఆఫర్ చేస్తున్నారు.

నింజా ZX-10R అంటేనే పవర్. ఇందులో 998cc ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 193 BHP పవర్‌ను, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ బైక్, గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సునాయాసంగా అందుకోగలదు. ట్రాక్ మీద పరుగెత్తడమే కాకుండా, హైవే రైడ్స్‌లో కూడా ఇది తిరుగులేని అనుభూతిని ఇస్తుంది.

Tags:    

Similar News