ఇల్లు కొనుక్కునే వారికి గుడ్‌న్యూస్

Update: 2019-07-05 06:20 GMT

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటలకు నిర‍్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని పార్రంభించారు.

మధ్యతరగతి గృహ రుణాలపై కాస్త ఊరట లభించింది. మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. రూ.45లక్షలులోపు గృహరుణాల తీసుకునే వారికి రూ.3.5లక్షలు వరుకు వడ్డీ రాయితీ ఉంటుంది. ఇనాళ్ళు రూ.2లక్షలుగా ఉన్న వడ్డీ రాయితీని రూ.3.50లక్షలకు పెంచారు.

బడ్జెట్ అప్‌డేట్స్‌...

ఎఫ్‌డీఐల ఆకర్షణకు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం * విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం* ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీ కోసం స్పెషల్ లాబీయింగ్‌.* ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం* ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం

రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది.* మెట్రోరైలు సర్వీసులు ఇప్పటి వరకూ దేశంలో 657కి.మీ. మెట్రో మార్గం ఉంది. * ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్‌, రవాణాకు, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం.* మహత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ * ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం. * అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది.

Similar News