ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆ నిధి ఇస్తాం : సీఎం జగన్

Update: 2019-07-11 08:54 GMT

రైతుల్ని ఆదుకునేందుకు 2 వేల కోట్లతో విపత్తుసహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఈ బడ్జెట్ లోనే కేటాయింపులు చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.. గత ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు జగన్.

ప్రస్తుత విత్తన కష్టాలకు కూడా టీడీపీ ప్రభుత్వ నిర్లక్షమే కారణమన్నారు...తమ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే అన్నదాతను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రకటించినట్లు చెప్పారు సీఎం జగన్... వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతిరైతు కుటుంబానికి 12,500 చొప్పున పెట్టుబడిసాయం అందించడం దేశంలోనే రికార్డని చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్..ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఈ నిధి అందిస్తామని చెప్పారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు జగన్.

Similar News