SC: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరపనున్నారు. 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై జవాబు చెప్పాలని కోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు పంపింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అంటూ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుదిక్కార పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గవాయి సూచించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు.
స్పీకర్ నిర్ణయం పట్ల ఎవరికైనా అసంతృప్తి ఉంటే.. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ఉన్నాయని.. అక్కడికి వెళ్లి తమ వాదనలు వినిపించుకోవచ్చని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ నాయకుడు హరీష్ రావు స్వయంగా ప్రకటించారని రేవంత్ గుర్తుచేశారు. సభలో సభ్యుల సంఖ్యను బట్టి స్పీకర్ బులిటెన్ విడుదల చేసినప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రచ్చ చేయడం సరికాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆ పార్టీలో క్రమశిక్షణ కరువైందని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ప్రజలు సైతం తమ నాయకుడిపై ఆశలు వదులుకున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు నిదర్శనమని సీఎం ధీమా వ్యక్తం చేశారు.