పోలీసులపై దాడికి గ్రామస్తుల ప్రయత్నం

Update: 2019-07-11 02:56 GMT

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఆర్టీసీ బస్సు అద్దాలు, పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ద్వంసం చేశారు. పోలీసుల ఎదుటే ప్రమాదం జరిగి యువకుడికి తీవ్ర గాయలైనా పట్టించుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు.

ఆరుగొండలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో వాహనదారులు తనిఖీలకు భయపడి రోడ్డుకు రెండు వైపులా వాహనాలను నిలిపివేశారు. తనిఖీల తర్వాత అదుపు తప్పి బైక్‌ మీద నుంచి యువకుడు పడిపోయాడు. తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ప్రశాంత్. దీంతో స్థానికులు యువకుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత నేపథ్యంలో గ్రామంలో పోలీసుల బలగాలు మోహరించారు.

Similar News