ఏపీ బడ్జెట్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వం కోసిన కోతలకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదన్నారాయన. ఈ విషయం వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. బడ్జెట్‌పై సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. జగన్ హామీలను గుర్తుంచుకుని బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు బడ్జెట్ స్పీచ్ సమంలో సభలో నిద్రపోతున్న చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి దృశ్యాన్ని ట్విట్‌కు జతచేశారు నారా లోకేష్.
తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే @ysjagan గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? pic.twitter.com/hLJgjR8bRs
— Lokesh Nara (@naralokesh) July 12, 2019