హైదరాబాద్‌లో వర్షం కుమ్మేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాత్రి పది గంటలకు ప్రారంభమైన వాన.. తెల్లవారుజాము వరకు కురుస్తునే ఉంది. భారీ వర్షంతో ప్రధాన రోడ్లు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాలానగర్, బల్కంపేట, పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, రాజ్‌భవన్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల్ని ఆదేశించారు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. మరోవైపు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగం దిగింది. రోడ్లపై నీళ్లు ఆగి ఉన్న ప్రాంతాలను గుర్తించి.. సహాయక చర్యలు చేపట్టింది.