డ్యూటీ మానేసి యాక్టింగ్‌లో టాలెంట్ చూపిస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు

Update: 2019-07-26 02:55 GMT

ప్రభుత్వ కార్యాలయాల్లోనే టిక్‌టాక్‌ చేస్తున్నారు. డ్యూటీ మానేసి యాక్టింగ్‌లో టాలెంట్ చూపిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్యోగుల మాదిరిగా.. గుజరాత్‌లో ఓ కానిస్టేబుల్‌ అర్పితా చౌదరి హిందీ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియో అధికారుల దృష్టికి రావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

ఈమధ్యే ఖమ్మం కార్పొరేషన్‌లోని కొందరు ఉద్యోగులు ఇలాగే టిక్‌టాక్‌ చేశారు. ఆ వీడియో రచ్చ రచ్చ కావడంతో లంచ్‌ టైమ్‌లో సరదాగా చేశామని కవర్‌ చేసుకునే ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఔట్‌ సోర్సింగ్‌ వారిని తొలగించారు. మిగతావారిని డిపార్ట్‌మెంట్ మార్చి సరిపుచ్చారు. ఉద్యోగాలు ఊడుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. టిక్‌టాక్‌ మోజు మాత్రం వీడలేకపోతున్నారు. ముఖ్యంగా యువతకు ఇదో డ్రగ్‌లా మారిపోయింది.

Similar News