ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బస్తర్ జిల్లా జగదల్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు సహా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాము ఇక దళంతో కలిసి పనిచేయమని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆరుగురు సీనియర్ నక్సల్స్ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ. 32లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.