భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జులై 31న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన లింగన్న మృతదేహానికి రి-పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రంలోగా పోస్ట్‌మార్టమ్ పూర్తి చేసి ఆగస్టు 5 లోగా నివేదిక ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌కు స్పష్టం చేసింది.
మావోయిస్టు లింగన్న మృతదేహం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉంది. గాంధీ హాస్పిటల్ ముగ్గురు సీనియర్ వైద్యులతో రి-పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం లింగన్న మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు.
లింగన్న రి-పోస్ట్‌మార్టమ్ నేపథ్యంలో పౌరహక్కుల నేతలు గాంధీ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.