ఓ వైపు గోదావరి ఉదృతి.. మరోవైపు కొందరు కాసుల కోసం కక్కుర్తి ..

Update: 2019-08-04 11:54 GMT

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరద గోదావరి ఊళ్లను ముంచెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ముంపుకు గురైన దేవీపట్నం 32 గ్రామాల ప్రజలను ప్రస్తుతం పునరావస ప్రాంతాలకు అధికారులు తలరించారు. రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న బ్రిడ్జి లంక, కేతవాని లంక గ్రామాల వాసులను రాజమహేంద్రవరంకు తరలించారు. ధవళేశ్వరం దిగువన కోనసీమ లంక గ్రామాలు ముంపు ముంగిట్లో ఉండడంతో ఆయా లంక గ్రామాల ప్రజలను తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు కొందరు కాసుల కోసం కక్కుర్తి .. ప్రమాదం అని తెలిసినా.. అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిది పశువుల్లంక రేవు దగ్గర యధేచ్ఛగా ఇసుక అక్రమ దోపిడీ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఇసుక కొత్త పాలసీని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో.. చాలా చోట్ల భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంది.. అందుకే కొందరు కాసుల కక్కుర్తితో ప్రాణాలను లెక్కచేయకుండా భారీ వరదలో సైతం ఇసుకను తరలిస్తున్నారు.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా ఇసుక దోపిడీ జరుగుతుందోని విమర్శలు వినిపిస్తున్నాయి..

Similar News