పెన్షన్లు అందడం లేదని వృద్ధుల ఆవేదన

Update: 2019-08-05 15:20 GMT

నెల్లూరు జిల్లాలో పెన్షన్ల ఆలస్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. రెండు నెలల ముందు వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడినా పడకున్నా తమకు మాత్రం సమయానికి పెన్షన్‌ అందేదని.. పిల్లల మీద ఆధారపడకుండా మందులు కొనుక్కునే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని వాపోతున్నారు.

పెన్షన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పండు ముసలివాళ్లు.. చివరకు నిరసనలకు దిగుతున్నారు. ప్రతీ నెల ఒకటో తేదీనే ఇవాల్సిన పెన్షన్లు.. 5వ తేదీ వచ్చినా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రతీ నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నెల్లూరు నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో వృద్ధులు ఆందోళనకు దిగారు.

Similar News