మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులు

Update: 2019-08-06 09:28 GMT

స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు మత్తుకు బానిసలుగా మారడం కలకలం రేపుతోంది. 10 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు వైట్‌నర్, ఫెవికాల్ సొల్యూషన్, నెయిల్ పాలిష్ రిమూవర్‌లను పీలుస్తూ తూలుతున్నారు. డబ్బుల కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ నేరస్థులుగా మారుతున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.

రేణిగుంట కట్ట సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు మత్తులో జోగుతుండటాన్ని పోలీసులు గమనించారు. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వారి దగ్గర నుంచి వైట్‌నర్, ఫెవికాల్ సొల్యూషన్, నెయిల్‌పాలిష్ రిమూవర్‌లను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించారు.

Similar News