రాష్ట్రంలో J-టాక్స్ గుబులు.. జగన్ పాలన అపూర్వం : నారా లోకేష్

Update: 2019-08-07 12:01 GMT

వైఎస్‌ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్. ఈ రెండున్నర నెలల్లో అంతా కమిటీలు, కమీషన్‌లే నడిచాయని ఆరోపించారు. వైసీపీ నేతలంతా గాల్లో తిరుగుతూ..భూమిపై సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు లోకేష్. మొత్తం 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..ఎకరాకు 10వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు..

Full View

రాజధాని అమరావతిని నిర్మించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు లోకేష్. అందుకే సీఎం జగన్ ప్రధాన మంత్రిని కలిసి నిధులు వద్దన్నారని ఆరోపించారు.. ఇక ఏపీ నిర్మాణ రంగానికి J-టాక్స్ గుబులు పట్టుకుందని ట్విట్టర్‌లో విమర్శించారు లోకేష్.. ఇప్పటికే ఏపీలో ఇసుక దొరక్క నిర్మాణరంగం నత్తనడకన నడుస్తోందన్నారు. ఇది చాలదన్నట్లు వైసీపీ నేతలు J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో జగన్ గారి కమిషన్‌ ఎంత అని ప్రశ్నించారు..చిన్నాపెద్దా అని తేడాలేకుండా ప్రజలంతా రోడ్డెక్కి నిరసన తెలిపేలా చేస్తున్న జగన్ పాలన అపూర్వం అటూ ఎద్దేవా చేశారు లోకేష్.

Similar News