ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలి - జగన్

Update: 2019-08-10 03:05 GMT

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అన్నారు సీఎం జగన్‌.. అభివృద్ధిలో ప్రస్తుతం ఏపీ నెంబర్‌ వన్‌ అని చెప్పలేకపోయినా.. పెడ్డుబడులు పెట్టేందకు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని గుర్తి చేశారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నౌకావ్రయాలు, విమానాశ్రయాలు, అపార వనరులు రాష్ట్రానికి బలం అన్నారు. అందుకే అంతా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు..

Full View

పాలనపై పూర్తి పట్టు సాధిస్తున్న సీఎం జగన్‌.. ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగా విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సుల్లో పాల్గొని పెట్టుబడులను ఆహ్వానించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా డిప్లొమాటిక్‌ అవుట్‌ రీచ్‌ పేరిట జరిగిన ఈ సదస్సుకు 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు జగన్. సుస్థిర ప్రభుత్వం.. సుదీర్ఘ తీర ప్రాంతం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, అపార వనరులు ఏపీ బలమని అన్నారు. అవినీతిరహిత పాలనతో పెట్టుబడిదారులకు భరోసా ఇస్తామన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ లో ఏపీ బలాలు, బలహీనతలను వివరించారు సీఎం జగన్. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీలు తమకు లేకున్నా.. పెట్టుబడులకు అనుకూలంగా ఉండే వనరులకు మాత్రం కొదువ లేదన్నారు. పెట్టుబడులకు మీ సహకారం కావాలంటూ విదేశీ ప్రతినిధులను కోరారు జగన్.

జగన్ సీఎం అయ్యాక పెట్టుబడుల కోసం ఇంతమంది దౌత్యవేతలతో సమావేశం కావటం ఇదే తొలిసారి. డిప్లామటిక్‌ సదస్సు తరువాత సీఎం జగన్‌ వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్‌ జనరల్స్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం జగన్‌ను తమిళనాడు మంత్రుల బృందం కలిసింది. చెన్నైలో తాగునీటి కష్టాలను జగన్‌కు వివరించారు. దీనిపై స్పందించిన జగన్‌ చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చేందుకు సహకరిస్తానని అన్నారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో సీఎం జగన్‌ అన్నారు.

Similar News