ఆ కారణంగానే ఆవులకు ముక్కులోనుంచి రక్తం

Update: 2019-08-11 04:32 GMT

తాడేపల్లి గోశాల ఆవుల మృతి తరువాత నిర్వాహకులు మేల్కొన్నారు. గోశాల మొత్తం శుభ్ర పరుస్తున్నారు. నిన్నటి వరకు అత్యంత దుర్గంద భరితంగా గోశాల దర్శనమివ్వగా..ఇప్పుడు గోవుల మృతితో ఆగమేఘాల మీద క్లీన్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 1500 ఆవులను పోషిస్తున్నారు నిర్వహకులు. అంతే కాదు వాటికి ఉన్న షెడ్డులు కూడా సరిపోని పరిస్థితి. దీంతో ఎండలోనే వందల ఆవులు కాలం వెళ్లదీస్తున్నాయి.

నిన్న 105 గోవులు మృతి చెందడంతో సీరియస్‌గా తీసుకున్న అధికారులు పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం టాక్సిసిటి ఉన్నట్టు తేలింది. టాక్సిసిటి కారణంగానే ముక్కులోంచి రక్తం వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. పోస్టు మార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప..ఇతర పదార్థాలేవి లేవని తేల్చారు.నిన్నటి పచ్చగడ్డి, దాణా, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన అధికారులు..పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

Similar News