తాతాజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

Update: 2019-08-12 06:10 GMT

తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ తాతాజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాతాజీగారి ఆకస్మిక మరణం బాధాకరమైన విషయమని.. నిబద్ధత, నైతిక విలువలు కలిగి ప్రజా సమస్యల పట్ల నిర్భీతిగా స్పందించిన తాతాజీ ఆదర్శనీయులన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ట్వీట్ చేశారు చంద్రబాబు.

Full View

అటు తాతాజీ మృతి పట్ల సంతాపం తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. నా పాత్రికేయ మిత్రుడు తాతాజీ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు తాతాజీ పడిన కష్టాన్ని తాను స్వయంగా చాలా సందర్భాలలో చూసానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. తాతాజీ కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Similar News