ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీ కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెన్నపల్లిలోని కోడెల నివాసానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. విద్యుత్ రిపేర్ల కోసమంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించారు. కంప్యూటర్లు తీసుకోవడాన్ని గమనించిన వాచ్‌మెన్ వీరిని అడ్డుకున్నారు. ఐతే.. వాచ్‌మెన్‌ను తోసేసి కంప్యూటర్లతో సహా దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.