ప్రైవేటు కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరిక

Update: 2019-08-27 14:43 GMT

టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. వినూత్న రీతిలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టాలన్నారు.. రాష్ట్రంలో ఇసుక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న చంద్రబాబు... భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులందరినీ ధర్నాలో కలుపుకొని వెళ్లాలని సూచించారు. వినూత్న నిరసనలతో ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నారు చంద్రబాబు.. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక రావాణా జరుగుతోందని ఆరోపించారు. ఇతర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారని.. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చామని.. మట్టి, ఇసుకను కూడా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఫైరయ్యారు.. ఇసుక వల్ల పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం అంతా రివర్స్‌లో ఉందని చంద్రబాబు ఫైరయ్యారు. అమరావతి, పోలవరం, పీపీఏలపై పెద్ద వివాదం నడుస్తోందని.. ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో అలజడి మొదలైందన్నారు. ఇది టెర్రరిస్ట్‌ ప్రభుత్వంలా తయారైందన్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారని.. అవసరమైతే ప్రైవేటు కేసులు పెడదామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Similar News