బలాబలాల విషయంలో మహిళలు.. పురుషులకు ఏం మాత్రం తీసిపోరు అనేందుకు.. నాగాలాండ్ ఎమ్మెల్యే తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియోనే చక్కటి ఉదహరణ.
గుంతలో చిక్కుకున్న మహింద్ర బొలెరో వాహనాన్ని నాగా మహిళా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది చాకచక్యంగా బయటకు తీశారు. నాగాలాండ్ ఎమ్మెల్యే మహోన్లునో కికన్ మంగళవారం తన ట్విట్టర్లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. 'రోడ్డు పక్కన గుంతలో పడిపోయిన మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా మహిళా బెటాలియన్‌కు చెందిన కొందరు జవాన్లు బయటకు తీశారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎక్కువ మంది చూడాల్సిన అవసరం ఉంది' అని కికన్ తెలిపారు. ఈ ట్వీట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా, కేంద్రమంత్రి కిరణ్ రిజుజుకు ట్యాగ్ చేశారు.
ఈ వీడియో చూసిన ఆనంద్ మహింద్ర స్పందించారు. బొలెరో గుంతలో ఎలా పడిపోయిందో నాకు తెలియదు.. కానీ నాగా మహిళా బెటాలియన్ జవాన్లు దానిని కాపాడారు. వారి శక్తి చూసిన తర్వాత కూడా వారితో పెట్టుకోవడం మూర్ఖత్వమే అవుతుందంటూ సరదాగా కామెంట్ చేశారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కూడా స్పందించారు. 'నాగా మహిళా బెటాలియన్ బలం చూడండి. వారి శక్తిసామర్థ్యాలను, జోష్‌ను అభినందిస్తున్నా.. అయితే డ్రైవర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. ఈ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు కూడా నాగా మహిళా బెటాలియన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Naga women Battalion lifting a Mahindra Bolero from the side drain! An old video which needs to be seen by more people. @anandmahindra @manoj_naandi @KirenRijiju @AmitShah @smritiirani pic.twitter.com/XivppAcGBi
— Mmhonlumo Kikon (@MmhonlumoKikon) August 27, 2019