హైదరాబాద్ ఎర్రగడ్డలో టీకొట్టు అద్దె విషయంలో ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వీరేందర్ యాదవ్ అనే వ్యక్తిపై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కొడుకు నరేందర్, అతని అనుచరులు తనను దారుణంగా కొట్టారని బాధితుడు చెప్తున్నాడు. తాను చెప్పేది వినకుండా అకారణంగా దాడి చేశారంటున్నాడు. లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించారని అంటున్నాడు. ఎర్రగడ్డలో వీరేందర్‌కి ఒక టిఫిన్ సెంటర్ ఉంది. దానికి అనుబంధంగా టీకొట్టు పెట్టుకునేందుకు అమర్ అనే వ్యక్తి వీరేందర్‌తో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇద్దరి మధ్య డీల్ కుదరకపోవంతో రాములు నాయక్ కొడుకు ఎంటరయ్యాడు. అమర్‌కి సపోర్ట్‌గా వచ్చి తనపై దాడి చేసినట్టు వీరేందర్ చెప్తున్నాడు. రాములు నాయక్ అనుచరుల దాడిలో వీరేందర్ గాయపడ్డాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో పలుచోట్ల గాలయ్యాయి. కాలు తెగి రక్తం కారింది.