భూగర్భజలాలోకి గరళం చేరుతోంది. శుద్ది చేసే అవకాశం కూడ లేకుండా పోతోంది. తాగటానికి కాకున్నా కనీసం వాడకానికి కూడా నీరు పనికిరావడం లేదు. ఆ నీటితో స్నానం చేసే వారందరికీ చర్మవ్యాధులు వస్తున్నాయని విశాఖ సరిపురంలోని విల్లా రాయల్ అపార్ట్ మెంట్ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ నివసిస్తోన్న చాలా మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. భూగర్భ జాలాల్లో క్లెబ్జిల్లా అనే బ్యాక్టీరియా ఉన్నట్టు పరీక్షల్లో తేలినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత ప్రజలు వాపోతున్నారు. అపార్ట్‌మెంట్ సమీపంలో పెట్రోల్ బంక్,ఆటోమొబైల్ వాటర్ సర్వీసింగ్ సెంటర్, డ్రైనేజీ ఉన్న కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని ఉపయోగించేవారికి చర్మవ్యాధులు రావడమే కాకుండా రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని చెబుతున్నారు.