HOSTLES: మూసివేత దిశగా హైదరాబాద్ హాస్టళ్లు !

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత

Update: 2026-03-12 05:30 GMT

హైదరాబాద్‌లోని పీజీ హాస్టళ్లు, మెస్‌లలోనూ వంటకు 90 శాతానికి పైగా గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో మెనూలో మార్పులు చేశారు. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబారు, పప్పు, రసం వంటివాటికే పరిమితం చేస్తున్నారు. రెండు, మూడురోజుల తర్వాత వీటిని పూర్తిగా నిలిపివేసి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని హాస్టల్‌ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

హాస్టల్ కష్టాలు

హై­ద­రా­బా­ద్‌­లో ఎస్సా­ర్‌­న­గ­ర్, అమీ­ర్‌­పేట, కే­పీ­హె­చ్‌­బీ, గచ్చి­బౌ­లి, మా­దా­పూ­ర్, కొం­డా­పూ­ర్, అశో­క్‌­న­గ­ర్, ది­ల్‌­సు­ఖ్‌­న­గ­ర్‌ సహా పలు­ప్రాం­తా­ల్లో హా­స్ట­ళ్లు వందల సం­ఖ్య­లో ఉన్నా­యి. వీ­టి­లో ఉండే వి­ద్యా­ర్థు­లు, ఉద్యో­గాల కోసం శి­క్షణ తీ­సు­కుం­టు­న్న ని­రు­ద్యో­గు­ల­పై తీ­వ్ర­ప్ర­భా­వం పడు­తుం­ది. గ్యా­స్‌ కొరత, ని­త్యా­వ­స­రాల ధరలు పె­ర­గ­డం­తో హో­ట­ళ్లు ధరలు పెం­చా­యి. రవా­ణా ఛా­ర్జీల భారం పడు­తుం­డ­టం­తో అల్పా­హా­రా­ల­పై 10 శాతం ధర­ల­ను పెం­చే­శా­రు. దోస, పూరీ, వడ­ల­పై కనీ­సం రూ.15 వరకు పె­రి­గా­యి. ఇడ్లీ, ఉప్మా­లాం­టి వా­టి­పై రూ.10 పెం­చా­రు. పె­ద్ద హో­ట­ళ్లు, రె­స్టా­రెం­ట్ల­లో 15 శాతం ధరలు పెం­చా­రు. తాము 22 ఏళ్లు­గా హో­ట­ల్‌ నడు­పు­తు­న్నా­మ­ని మూడు రో­జు­లు­గా వా­ణి­జ్య సి­లిం­డ­ర్లు లభిం­చ­డం లే­ద­ని ఉప్ప­ల్‌­కు చెం­దిన కె.నా­రా­యణ అన్నా­రు. దీం­తో హో­ట­ల్‌­ను మూ­సి­వే­యా­ల్సిన పరి­స్థి­తి నె­ల­కొం­ద­న్నా­రు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే హాస్టళ్లు మూత పడుతాయని అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు.

దే­శా­ని­కి అవ­స­ర­మైన ఎల్పీ­జీ సర­ఫ­రా­లో దా­దా­పు 62 శాతం వరకు ది­గు­మ­తు­ల­పై ఆధా­ర­ప­డు­తుం­ది. అయి­తే పశ్చి­మా­సి­యా­లో యు­ద్ధ పరి­స్థి­తు­లు నె­ల­కొ­న­డం­తో హా­ర్ము­జ్ జల­సం­ధి­లో నౌకల రా­క­పో­క­లు ప్ర­భా­వి­త­మ­య్యా­యి. దీం­తో భా­ర­త్‌­కు గ్యా­స్ ది­గు­మ­తు­లు ని­లి­చి­పో­యా­యి. అదే­వి­ధం­గా సౌదీ అరే­బి­యా, ఖతా­ర్ వంటి దే­శాల నుం­చి కూడా సర­ఫ­రా­లో అం­త­రా­యం ఏర్ప­డిం­ది. ఈ పరి­స్థి­తు­ల్లో కేం­ద్ర ప్ర­భు­త్వం తా­త్కా­లి­కం­గా కమ­ర్షి­య­ల్, ఇం­డ­స్ట్రి­య­ల్, ఆటో­మొ­బై­ల్ రం­గా­ల­కు ఎల్పీ­జీ సర­ఫ­రా­ను తగ్గిం­చి­న­ట్లు సమా­చా­రం. అయి­తే దీ­ని­పై అధి­కా­రిక ప్ర­క­టన చే­య­క­పో­యి­నా గృహ వి­ని­యో­గ­దా­రు­ల­కు ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని ఆయి­ల్ మా­ర్కె­టిం­గ్ సం­స్థ­ల­కు సూ­చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. గృహ వి­ని­యో­గ­దా­రుల అవ­స­రా­ల­ను ముం­దు­గా తీ­ర్చా­ల­ని కేం­ద్రం సూ­చిం­చి­న­ట్లు సమా­చా­రం.

Tags:    

Similar News