ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి.. పోలీసులు ఎదురుకావడంతో..

Update: 2019-09-03 05:44 GMT

శేషాచలం అటవీప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు అలజడి సృష్టించారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట బాలపల్లి అటవీ ప్రాంతంలో దాదాపు 30 మంది స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను మోసుకుని వెళుతూ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి ఎదరుయ్యారు. స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిపై రాళ్లు రువ్వి దుంగలను వదిలి పారిపోయారు.

27 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాగా చీకటిగా ఉండటం, మరోవైపు వర్షం కురుస్తుండటంతో స్మగ్లర్లు ఈజీగా తప్పించుకున్నారు. వారి కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిస్తున్నారు.

Similar News