ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఐదు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. గురువారం నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. టన్ను ఇసుక ధరను 375 రూపాయలుగా నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కే కేబినెట్ మొగ్గు చూపింది. మచిలీపట్నం పోర్టుకు గతంలో కేటాయించిన 412.5 ఎకరాలను వెనక్కు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు.. మావోయిస్టులపై నిషేధం పొడిగించారు. ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు పచ్చజెండా ఊపారు.