చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

Update: 2019-09-04 09:23 GMT

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో 'దొన్ను దొర' పసుపు కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ రెబల్‌గా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన దొన్ను దొర.. తెలుగుదేశంలో చేరడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల తర్వాత టీడీపీలోకి తొలి చేరిక కావడంతో స్థానికంగా మరింత బలోపేతం అవుతామని ధీమాగా ఉన్నారు.

Similar News