చిన్నాన్నను ఇంట్లో చంపితే..

Update: 2019-09-05 10:12 GMT

6 నెలలు కొత్త ప్రభుత్వానికి సమయం ఇస్తామని చెప్పామని.. కానీ జగన్ తొలిరోజు నుంచే అరాచకాలు ప్రారంభించారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంత రాక్షస ప్రభుత్వాన్ని తన అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో అలజడులు సృష్టిస్తే వైసీపీకి పుట్టగతులుండవని అన్నారు. సొంత చిన్నాన్నను ఇంట్లో చంపితే ఇంత వరకూ కనిపెట్టలేని స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Full View

Similar News