డప్పు చప్పుళ్లతో శునకానికి అంత్యక్రియలు

Update: 2019-09-05 03:48 GMT

లోకంలో అత్యంత విశ్వాసమైన జంతువు ఏదైనా ఉందంటే అది శునకం మాత్రమే.. అలాంటిది ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న శునకం మరణిస్తే.. దానిని పెంచుకుంటున్న వారి బాధ వర్ణనాతీతం. ఆ బాధను దిగమింగుతూ మరణించిన శునకానికి ఎంతో ఘనంగా వీడ్కోలు పలికారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఉదయగిరి రమేష్ దంపతులు అంత్యక్రియలు చేశారు . 9 సంవత్సరాలుగా పెంచుకుంటున్న రోట్వేల్లర్‌కు చెందిన శునకంపై వీది కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన శునకానికి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన శునకానికి.. తమ ఇంటి మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలాగే బంధువులను పిలిచి డప్పు చప్పుళ్లతో టపాసులు కాల్చుతూ కన్నీటితో వీడ్కోలు పలికారు రమేష్ దంపతులు.

Similar News