ఆ విషయంలో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలి - చంద్రబాబు

Update: 2019-09-06 02:15 GMT

వైసీపీ ప్రభుత్వానికి విధ్వంసమే ఎజెండా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై పోరాటం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోదాపై మాట తప్పిన వైసీపీని ఊరూరా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Watch Fast News in 3 Minutes :

Full View

అమరావతిని చంపేసే స్థితికి తెచ్చారు. విపక్ష నేతలపై దాడులు చేస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అరచకాలు కొనసాగిస్తున్నారంటూ.. జగన్‌ వంద రోజుల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా జగన్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. పార్టీ పరిస్థితులు, వైసీపీ దాడులపై ఆరా తీస్తూనే.. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో దాడులకు తెగబడితే వైసీపీకి పుట్టగతులుండవని అన్నారు. సొంత చిన్నాన్నను ఇంట్లో చంపితే ఇంత వరకూ కనిపెట్టలేని స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

22 ఎంపీ సీట్లు గెలిచినా.. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హోదాను ఎప్పుడు తీసుకొస్తారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపిచ్చారు. ప్రత్యేక హోదాతోనే భవిష్యత్తు బాగుంటుందని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎత్తడం లేదని ప్రశ్నించారు.

ప్రతీ సీనియర్ నాయకుడు ఒక యువ నాయకుడ్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి యువరక్తం ఆవశ్యకత ఉందన్న ఆయన.. మరో 30 ఏళ్ల వరకు నాయకుల్ని తయారు చేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. జగన్ రాక్షస పాలనలో వైసీపీ అరాచకాలు హద్దుదాటిపోతున్నా పోలీసులు మిన్నకుండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పల్నాడు ప్రాంతంలో వెలివేసిన 130 కుటుంబాలను పోలీసుల రక్షణలో మళ్లీ వారి గ్రామానికి తీసుకెళ్లాలన్నారు. లేదంటే చలో అత్మకూరు చేపడతామన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి విధ్వంసమే ప్రధాన అజెండా అన్నారు. కొత్త ప్రభుత్వం నిలదొక్కుకునేందుకు ఆరు నెలలు సమయం ఇద్దామనుకుంటే.. తొలి రోజు నుంచే అరాచకాలు ప్రారంభించారని విమర్శించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని చంపేసే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పైసా ఖర్చులేకుండా సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌తో ముందుకు పోయే ప్రాజెక్టును దెబ్బతీశారని చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.

టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేలా తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగింది. అమరావతి నుంచి రోడ్డు మార్గం ద్వారా రావుల పాలెంకు చేరుకున్న ఆయనకు.. ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. తొలి రోజు 9 నియోజకవర్గాల నేతలతో సమావేశమైన ఆయన.. శుక్రవారం పది నియోజకవర్గ శ్రేణులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

Full View

Similar News