టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్‌లో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తుగ్లక్ 2.0 ఎట్ 100 డేస్ అంటూ ట్వీట్ చేశారు. తుగ్లక్ గారి పాలనలో ధర్నా చౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్ అన్నారు. అమరావతిని ఎడారి చేశారని.. పోలవరాన్ని మంగళవారంగా మార్చారని ట్వీట్ చేశారు లోకేష్. 9 వందల హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారని దుయ్యబట్టారు. ఇంత చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదన్నారు లోకేశ్.