సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని ఆసుపత్రిలో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. శుక్రవారం రాత్రి డెలివరీ కోసం వచ్చిన తమ కూతురిని వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
నెలలు నిండటంతో షేక్ మల్సూర్ భార్య జహేదాను ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఇంకా 10 రోజుల సమయం ఉందని వైద్యులు వెనక్కి పంపారు. పురిటి నొప్పులు తీవ్రం కావడంతో బంధువులు మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సకాలంలో వైద్యులు స్పందించలేదని, అందరూ బతిమిలాడితే కాన్పు చేశారని బంధువులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఆలస్యమై శిశువు గర్భంలోనే మరణించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. పైగా కాన్పు చేసి తల్లిని రక్షించామని హాస్పిటల్ స్టాఫ్ చెబుతున్నారు.
Also watch :