ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు మరోసారి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత వాసులను ముంపు భయం వెంటాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద పెరగడంతో కొత్తూరు కాజ్‌వే పై 12 అడుగుల మేర నీరు చేరింది. పోలవరం నుండి ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.