కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మొహర్రం వేడుకల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పీర్ల చావిడి వద్ద ఒక్కసారిగా పిట్టగోడ కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలంతా మొహర్రం వేడుకల్లో ఉండగా ఒక్కసారిగా పిట్టగోడ కూలడంతో వారంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక తలోవైపు పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిట్ట గోడపై బరువు పెరగడంతో కూలి ఉంటుందని భావిస్తున్నారు.