ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Update: 2019-09-10 06:37 GMT

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణిస్తోన్న ఓ ద్విచక్ర వాహనం బ్రిడ్జిని బలంగా ఢీ కొట్టడంతో అశోక్‌, అఫ్సర్‌, అబ్దుల్ అజీజ్‌ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాపూరు మండలం ఓబులాయపల్లిలో జరిగిన మొహర్రం వేడుకలు చూసి పెంచలకోనకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News